అమ్మాయిలను ప్రశ్నించే వారికి చురలకు అంటించిన మహాతల్లి
- March 9, 2017 / 07:31 AM ISTByFilmy Focus
అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి, అబ్బాయిలతో సమానంగా చూడాలని వేదికలు ఎక్కి ప్రతిఒక్కరూ ఉపన్యాసాలు ఇస్తారు. అమలు చేసేవారు మాత్రం నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వారంతా అమ్మాయివి నువ్వు ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. ఇలా మాట్లాడకూడదు.. అలా కూర్చోకూడదు అని రూల్స్ చెబుతుంటారు. ఇదే టాపిక్ ని తీసుకొని మహాతల్లి ఈ వారం మనముందుకు వచ్చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా “అమ్మాయిలాగా…అంటే ఎలాగా ?” అనే క్యూట్ వీడియోతో అమ్మాయిలని చీటికీ మాటికీ ప్రశ్నించే వారికి చురకలు అంటించింది.
జాహ్నవి తో పాటు, గౌతమి, కార్తీక్, జోన్స్ చేసిన హడావుడి నవ్వులు పూయించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














