అమ్మో అమీతో అంత ఈజీ కాదు…
- August 19, 2017 / 05:35 AM ISTByFilmy Focus
బికినీ మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన అమీ జాక్సన్ ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రసీమల్లో హాట్ పిక్. అమ్మడి డేట్స్ కోసం సూపర్ స్టార్ హీరోలు మొదలుకొని భారీ నిర్మాణ సంస్థల వరకూ కాపు కాచారు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు అన్ని దారుల్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది అమీ. ఈ సుందరీమణికి సినిమా అవకాశాల కంటే ఎక్కువగా బ్రాండింగ్ చాన్సస్ ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉండడంతో ప్రతి ఒక్కరూ అమీ కోసం వెంపర్లాడుతుంటారు.
ఇటీవల ఓ ప్రముఖ వ్యాపార సంస్థ అమీ జాక్సన్ ను తమ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొంది. అగ్రిమెంట్ ప్రకారం ఒక ఫోటో చేయాల్సి ఉండడంతో ఒకరోజును తమకు కేటాయించాల్సిందిగా కోరింది సదరు సంస్థ. అయితే.. అమీ జాక్సన్ మాత్రం కేవలం ఆరు గంటలు మాత్రమే తాను ఫోటో షూట్ కు సహకరిస్తానని చెప్పిందట. ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని కూడా ఇదేంటని తొలుత వాపోయినా ఇంక చేసేదేమీ లేక ఆ ఆరు గంటల్లోనే షూటింగ్ మొత్తం చక్కబెట్టారు సదరు సంస్థ నిర్వాహకులు. అయితే.. ఈ విషయం తెలిసివారు మాత్రం ఆరు గంటల కోసం ఆరు కోట్ల రూపాయల పారితోషికమా అంటూ నోరెళ్ళబెడుతున్నారట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













