శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన “ఐ” సినిమా ద్వారా అమీ జాక్సన్ ఎక్కువమందికి పరిచయమైంది. బ్రిటన్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మోడల్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ అందంతోనే తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ఆకర్షించి మద్రాసపట్టిణంలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగులో ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించింది. అమీ జాక్సన్ కి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని శంకర్ తన 2 .o లోను ఛాన్స్ ఇచ్చారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడీగా నటించింది. ఈ సినిమాలో న్యూడ్ గా నటించినట్లు, ఆమె న్యూడ్ అందాలు ఇంగ్లీష్ కాపీ లో ఉంటాయని ప్రచారం సాగుతున్నాయి. వాటిని ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటున్న వారికీ అమీ ముందుగానే విందు పంచింది.
హాట్ ఫోజులతో యువకుల మతులు పోగొడుతోంది. ఖరీదైన సూట్ లో సైతం అందాలు ఆరబోసింది. ఈ ఫోటోలు చూసి అందరూ అభినందిస్తుంటే.. తాను ఇంత అందంగా కనిపించడానికి మేకప్ మెన్ నిక్కి పాట్రిక్ విల్సన్ ప్రతిభ కారణమని క్రెడిట్ అతనికిచ్చింది. దీంతో ఆమె రూపమే కాదు.. మనసు కూడా అందమైనదని నెటిజనులు కితాబు ఇస్తున్నారు. 2 .o రిలీజ్ కాకముందే అమీ జాక్సన్ హాలీవుడ్ లో “సూపర్ ఉమెన్” సిరీస్ లో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో ఇంట్రనేషనల్ స్టార్ అయిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.