తమిళ చిత్రం “అనేగన్”తో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ ఆ తర్వాత తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ పెద్దగా సత్ఫలితం లభించలేదు. ఏవో చిన్న చిన్న సినిమాల్లో తప్పితే ఆమె ఆశించిన స్థాయి అవకాశాలు మాత్రం అమ్మడికి లభించలేదు. ఇటీవల నటించిన “మనసుకు నచ్చింది” చిత్రం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అమ్మాయికి అవకాశాలు రావడం కష్టం అనే విషయంలో క్లారిటీ వచ్చేసినట్లుంది. అందుకే తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూడడం ఆపి తనకు కాస్తో కూస్తో పేరున్న హిందీలోనే అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.
ఆల్రెడీ “కాలాకండి” చిత్రంలో చిన్న పాత్రతో మెప్పించిన అమైరాకు “మెంటల్ హై క్యా” అనే చిత్రంలో నటించే అవకాశం దక్కింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, కంగనా రనౌత్ లు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. అమైరా ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు లవర్ గా నటించనుందట. ఈ సినిమా తర్వాతైనా మరిన్ని అవకాశాలు వస్తాయేమోనని అమైరా ఆశగా ఎదురుచూస్తోంది.