అభిరామ్ కోసం పద్ధతి మార్చుకున్న తేజ!

Advertisement

దర్శకుడు తేజ తన కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథలనే తెరకెక్కించాడు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ ప్రేమకథలే తీశాడు. నితిన్, నవదీప్ లాంటి నటులను హీరోలుగా పరిచయం చేసినప్పుడు కూడా లవ్ స్టోరీస్ నే ఎన్నుకున్నాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను తేజ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని వార్తలు రాగానే ఇది కూడా మరో లవ్ స్టోరీ ఏమోనని అందరూ అనుకున్నారు. రీసెంట్ గా అభిరామ్ కూడా ఓ లవ్ స్టోరీలో నటించబోతున్నానని చెప్పడంతో వీరి కాంబోలో ప్రేమ కథ పక్కా అని ఫిక్స్ అయ్యారు.

కానీ ఈసారి తేజ రూట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. అభిరామ్ కోసం యాక్షన్ కథను రెడీ చేశాడట. సురేష్ బాబు కూడా ఇప్పుడు ఆ కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా దర్శకులు స్క్రిప్ట్ లాక్ చేసుకొని షూటింగ్ కు వెళ్తారు. కానీ తేజ అలా కాదు. రాస్తూ.. రాసింది తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేస్తాడు. కానీ ఈసారి సురేష్ బాబు కాంపౌండ్ లో అలా కుదరడం లేదు. స్క్రిప్ట్ లాక్ చేసిన తరువాతే షూటింగ్ మొదలుపెట్టాలని సురేష్ బాబు ఆదేశించడంతో తేజ ఆటలు సాగలేదు.

అభిరామ్ డెబ్యూ ఫిలిం కావడంతో సురేష్ బాబు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే సురేష్ బాబు కోసం తేజ తన పద్దతిని మార్చుకున్నాడు. మొదటిసారి పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసి బౌండెడ్ స్క్రిప్ట్ సురేష్ బాబు చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను సురేష్ బాబు ఓకే చేసేశాడు. నిజానికి తేజ ‘చిత్రం 1.1’ కథను రెడీ చేసి.. దాన్ని పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు. ఇంతలో అభిరామ్ ప్రాజెక్ట్ వచ్చింది. అభిరామ్ కోసం ప్రస్తుతం ‘చిత్రం 1.1’ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus