Adipurush: ‘ఆదిపురుష్‌’ టీమ్‌ గ్రూపీ చూశారా?

భారతీయులకు రామాయణం అనేది ఓ ఎమోషన్‌. ఎన్నో ఏళ్ల నుండి రామాయణం ఏ ఫార్మాట్‌లో వచ్చినా చూస్తునే ఉన్నాం, చూస్తూనే ఉంటాం. అందుకే మన దర్శకనిర్మాతలు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో రామాయణాన్ని తెరకెక్కిస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో రామాయణం తెరకెక్కుతోంది. ఈసారి ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఏ సమాచారం వచ్చినా ఆసక్తికరంగానే ఉంటోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న రామాయణం ‘ఆది పురుష్‌’.

ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ గ్రూపీ దిగింది. ఇప్పుడు ఆ ఫొటో వైరల్‌గా మారింది. అందులో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. వారితోపాటు దర్శకుడు కూడా ఉన్నారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫొటోయే మీరు పైన చూసింది. సినిమాలో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్న విషయం ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ ఫొటోను లక్ష్మణ పాత్రధారి సన్నీ సింగ్‌ తీశాడు.

అందులో హనుమంతుడు పాత్రధారి దేవ్‌దత్తా కూడా ఉన్నారు. ప్రభాస్‌ లుక్‌లో కొద్దిపాటి తేడా కనిపిస్తోంది. ఇటీవల ప్రభాస్‌ లుక్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి లుక్‌లో ఏమీ ప్రభాస్ కనిపించడం లేదు. కాస్త బాగున్నాడు. సో ఇకనైనా ఆ కామెంట్లు ఆగుతాయేమో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus