అప్పుడే మూడో సినిమాని కూడా ఓకే చేసేసిన ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘దొరసాని’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. రొటీన్ కథే ఆయినప్పటికీ కథనం బాగానే ఉందంటూ ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులు. అయితే కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఆనంద్ దేవరకొండ కు మొదటి సినిమా కాబట్టి పాస్ మార్కులు వేయించుకున్నాడు.దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న ఆనంద్ ఈ మధ్యే అంటే… లాక్ డౌన్ కు ముందే తన రెండవ సినిమాని మొదలు పెట్టాడు.

ఈ చిత్రం కమర్షియల్ ఎలెమెంట్స్ తో కూడుకుని ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆ చిత్రం షూటింగు దశలో ఉండగానే, మరో చిత్రాన్ని కూడా ఓకే చేసేసాడు ఆనంద్ దేవరకొండ.దామోదర అట్టాడ అనే నూతన దర్శకుడు వినిపించిన కథ కొత్తగా అనిపించడం అందులోనూ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో … ఆనంద్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. విజయ్ మట్టపల్లి .. ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట.

హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఆనంద్ పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుందనీ.. తన కెరియర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టు ఆనంద్ దేవరకొండ తెలిపాడట. మరి ఈ తన నమ్మకం ఎంత బలమైనదో ఈ చిత్రాల ఫలితాల్ని బట్టి చెప్పొచ్చు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus