ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ‘సివంగి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్న ప్రముఖ సినిమాటోగ్రఫర్ భరణి కే ధరన్

ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సివంగి. 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు.

ఈ చిత్రానికి AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వంలో పాటు డీవోపీగా పని చేస్తునంరు భరణి కె ధరన్. సంజిత్ Mhd ఎడిటర్.

ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెజయజేస్తారు మేకర్స్.

నటీనటులు : ఆనంది – వరలక్ష్మి శరత్‌కుమార్ -జాన్ విజయ్ – డా.కోయ కిషోర్,
ప్రొడక్షన్ హౌస్: ఫస్ట్ కాపీ మూవీస్
నిర్మాత: నరేష్ బాబు.పి
రచన, దర్శకత్వం : భరణి కె ధరన్
సంగీతం : AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్
డీవోపీ: భరణి కె ధరన్
ఎడిటర్: సంజిత్ Mhd
ఆర్ట్ : రఘు కులకర్ణి
పీఆర్వో: తేజస్వి సజ్జా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus