మెగా ఫ్యామిలీలో కొత్త సందడి మొదలైంది. అది ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న సంగతి ఇప్పటికీ అందరికీ తెలిసిందే. ఇక ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజే డెలివరీ డే. వారసులతో ఉపాసన ఇంటికి వచ్చే సందర్భాన్ని మరిచి పోకుండా ఓ మరుపురాని కార్యక్రమంగా మలచాలని చిరు అండ్ ఫ్యామిలీ భావిస్తున్నారు.
ఆల్రెడీ అపోలోలో డెలివరీ కోసం ఉపాసన అడ్మిట్ అవ్వడం జరిగింది. ట్విన్స్ లో అబ్బాయి ఉంటాడా? చిరు కోరిక తీరుతుందా? వంటి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దానికి తెరదించుతూ అభినులకు గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. చరణ్- ఉపాసన..లకి పుట్టిన ట్విన్స్ లో ఓ పాప, ఓ బాబు ఉన్నట్టు స్పష్టంచేసింది. దీంతో ‘చరణ్ కి అబ్బాయి పుట్టాలనే… చిరు కోరిక తీరింది’ అని అంతా చెప్పుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అపోలో హాస్పిటల్ కి వెళ్లి ఉపాసన, చరణ్..లని కంగ్రాట్యులేట్ చేస్తున్నట్టు వినికిడి.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యేందుకు సిద్దమయ్యారట.మరి కాసేపట్లో చిరంజీవి మీడియాతో ఇంటరాక్ట్ కాబోతున్నారు.
ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని ఫామ్లోకి వచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసుకుంది. త్వరలో రామ్ చరణ్ కూడా ‘పెద్ది’ తో రానున్నారు.ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూస్తుంటే మెగా ఫ్యామిలీకి ఈ 2026 మరపురాని సంవత్సరంగా నిలిచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026