అనన్య నాగళ్ల గురించి ఇప్పటి యూత్ పోరగాళ్లకి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. చూడగానే ఆకట్టుకునే రూపం.. చూపు తిప్పుకోనివ్వకుండా చూసే చూపులు.. చిలిపి నవ్వు.. అమాయకత్వం నిండిన ముఖంతో కుర్రకారుని ఫిదా చేసేసింది.. ‘మల్లేశం’, ‘ప్లేబ్యాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలు చేసిన ఈ తెలుగమ్మాయికి.. పవన్ కళ్యాణ్ మూవీ బిగ్ బ్రేక్ ఇస్తుంది.. యాక్ట్రెస్‌గా బిజీ అయిపోతుంది అనుకున్నారంతా.. కట్ చేస్తే కొత్త సినిమాలేవీ కమిట్ అయ్యినట్టు లేదు.. అందుకే ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు..
సినిమాల్లో కనిపించకపోతేనేం.. ఎంచక్కా సోషల్ మీడియాలో డైలీ అప్ డేట్స్ ఇస్తుందిగా.. అది చాల్లే మాకు అంటున్నారు కుర్రాళ్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది అనన్య.. పద్ధతిగా కనిపిస్తూనే పరువాలు పరవడం ఎలా అనేది అనన్యకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అన్నంతగా ఉంటాయి తన ఫొటోషూట్ పిక్స్.. ‘అమ్మడు గ్లామర్ ఒలకబోస్తూ.. దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నా కానీ సరైన సినిమా ఎందుకు పడడం లేదో అర్థం కావడంలేదు.. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. స్క్రీన్ షేక్ అయిపోద్ది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..