కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తన పెర్ఫార్మన్స్ తో దర్శకుల దృష్టిని ఆకర్షించింది నటి అనన్య నాగళ్ల. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాతో అనన్య హీరోయిన్ గా పరిచయమైంది. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అనన్య ‘పద్మ’ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించింది.
ఈ సినిమాలో అనన్యకు మంచి పాత్రే దక్కింది. ఈ సినిమా తరువాత ఆమెకి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ‘మల్లేశం’ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. గచ్చకాయలు ఆటలు ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ‘పద్మ’ క్యారెక్టర్ లోకి వెళ్లడానికి తను తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్పింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పల్లెలకు వెళ్లి అక్కడ వాళ్ల ఆటలు, ప్రవర్తన, భాష, యాస ఎలా ఉంటుందో తెలుసుకున్నానని చెప్పింది.
తను ఆన్ స్క్రీన్ మీద చేసే పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పింది. అందరినీ అలరించడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పుకొచ్చింది. తనపై నమ్మకం ఉంచి పద్మ లాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెప్పింది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!