అనసూయ కు పివిపి భారి ఆఫర్..!
- March 16, 2016 / 06:12 AM ISTByFilmy Focus
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్రనిర్మాణ సంస్థల్లో “పివిపి” ఒకటి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ.. మధ్యలో లో బడ్జెట్ మూవీస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంది. ఇటీవల “క్షణం” చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకొన్న పివిపి సంస్థ..
సదరు చిత్రంలో కీలకపాత్ర పోషించిన హాట్ యాంకర్ అనసూయతో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. “క్షణం” తరహా థ్రిల్లర్ కాకుండా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని, ఓ యువ ప్రతిభాశాలి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని పివిపి యూనిట్ చెబుతోంది.
అనసూయ వెండితెరపై కూడా తనదైన మార్క్ తో అగ్ర స్థానానికి చేరుకోవడం ఖాయమేమో!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















