రంగం సిద్ధం చేసుకొంటున్న రంగమ్మత్త!

  • June 18, 2018 / 07:28 AM IST

“రంగస్థలం”లో రంగమ్మత్తగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న తర్వాత మళ్ళీ కొత్త సినిమాలు సైన్ చేయని అనసూయ హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ తన షోస్ తను చేసుకుంటూ వెళుతోంది. అనసూయ మళ్ళీ రంగమ్మత్త రేంజ్ పాత్ర వస్తే తప్ప మరో సినిమా సైన్ చేయదేమో అనుకొన్నారందరూ. నిన్న కొందరు మీడియా మిత్రులతో సరదాగా మాట్లాడుతూ “నేనో మూడు సినిమాలు సైన్ చేశాను, అది కూడా సపోర్టింగ్ రోల్స్ కాదు, ఇంపార్టెంట్ రోల్స్” అంటూ చెప్పుకొచ్చిందట అనసూయ.

అయితే.. ప్రొజెక్ట్స్ డీటెయిల్స్ కోసం మాత్రం కొన్నాళ్లపాటు ఆగాల్సిందేనని చెప్పేసిందట. చూస్తుంటే.. ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకొన్న అనసూయ ఆ క్రేజ్ ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకొనేలాగే కనిపిస్తోంది. ఇకపోతే.. అనసూయ ప్రస్తుతం సన్నబడే పనిలో ఉందని, అందుకోసం స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకొంటుందని టాక్. సన్నబడిన తర్వాత సినిమాల్లో జోరు పెంచేందుకు సన్నద్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus