యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇలా ఈమె వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా అనసూయ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇక అనసూయ సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
అయితే కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి భారీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇదిలా ఉండగా అనసూయ తాజాగా పిల్లల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈమెకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే. అయితే తనకు ఒక కూతురు కావాలని కోరిక ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు.
కూతురు లేరన్న అసంతృప్తి ఇప్పటికి తనని వెంటాడుతూనే ఉందనీ తెలిపారు. ఈమె తనకు కుమార్తె కావాలనే కోరిక ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె గతంలో కూడా తాను మరోసారి తల్లిని కావాలనుకుంటున్నాను కూడా కామెంట్లో చేశారు. అయితే ఇప్పుడు కూడా తనకు కూతురు కావాలని కోరిక ఉంది అని తెలియజేయడంతో నెటిజన్స్ (Anasuya) ఈమెకు విభిన్న రీతిలో సలహాలు ఇస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!