బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెర రంగమ్మత్తగా కూడా అదే స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకుంది. రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయ నటనకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా సినిమా అవకాశాలు రావడంతో క్రమక్రమంగా బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తాజాగా రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే కొందరు నేటిజన్స్ పుష్ప 2సినిమా గురించి అప్డేట్ ఇవ్వాల్సిందిగా కోరారు అయితే తాను ఇంకా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెట్టలేదని అనసూయ తెలియచేశారు.
అయితే ఒక నెటిజన్ (Anasuya) అనసూయని ప్రశ్నిస్తూ మీరు అభిమానులతో ఎందుకు ఫోటోలు దిగరు వారి వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ కూడా తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.. ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ మనుషులన్న తర్వాత కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన మేము మనుషులం కాదనుకుంటే ఎలా…
మేము కూడా మనుషులమే కదా ఎన్నోసార్లు ఎంతోమంది అభిమానులతో కలిసి తాను ఫోటోలు దిగాను మీతో దిగలేదని ఈ విధంగా నన్ను జడ్జ్ చేయడం సరైనది కాదు అంటూ అనసూయ సమాధానం చెప్పారు.మీరు నిజంగా అభిమానులు అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!