Anasuya: అనసూయ బోల్డ్ ఫోటో షూట్.. హాట్ టాపిక్ గా మారిన ఫోటోలు!

అనసూయ బుల్లితెర పై కనిపించడం తగ్గించింది. ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లోనే నటిస్తోంది. ఈ మధ్యనే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మైఖేల్’ మూవీలో ఓ ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన ఆమె ప్రస్తుతం ‘ఫ్లాష్ బ్యాక్’ ‘పుష్ప 2’ సినిమాల్లో నటిస్తోంది. ‘రంగమార్తాండ’ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని చెప్పాలి. వీటితో పాటు సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ‘అరి’ మూవీలో కూడా ఈమె నటించింది. అది కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీలో అనసూయ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం తన లేటెస్ట్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ అమ్మడు. మొన్నటికి మొన్న పద్దతిగా రెడ్ కలర్ శారీలో కనిపించి ‘బ్యూటిఫుల్’ అనే కామెంట్స్ దక్కించుకున్న అనసూయ ఇప్పుడు పిక్కలు కనబడేలా లో యాంగిల్ లో చేసిన బోల్డ్ ఫోటో షూట్లో పాల్గొంది. తక్కువ టైంలోనే ఈ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus