ఓటీటీల హవా ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినోదం కోసం థియేటర్ల వరకు వెళ్ళే రోజులు కావివి. థియేటర్లకి పోటీగా ఓటీటీ సంస్థలు ఒరిజినల్ కంటెంట్ ను అందిస్తున్నాయి. తద్వారా ఎంతోమంది అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి అవకాశాలు లభిస్తున్నాయి. కంటెంట్ బాగుండాలే కానీ చిన్న సినిమాలకు, ఇండిపెండెంట్ సినిమాలకు ఓటీటీల ద్వారా మంచి రీచ్ వస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇదే క్రమంలో తెలుగు ఆంథాలజీ చిత్రంగా ‘డార్క్ సీక్రెట్స్’(Dark Secrets) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం “Top 10 Purchases in India” జాబితాలో ఈ చిత్రం నంబర్ 1 స్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వేరే భాషల చిత్రాలతో పోటీ పడి మరీ ఈ స్థానానికి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే మేకర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిత్రాలకు కూడా మంచి రీచ్ ఉంటుంది అని ‘డార్క్ సీక్రెట్స్’ ప్రూవ్ చేసింది.
అలాగే సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి చర్చలు జరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.‘డార్క్ సీక్రెట్స్’ చిత్రానికి అవినాష్ కొకటి దర్శకుడు. ‘టచ్‌వుడ్ టేల్స్’ బ్యానర్‌పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగారం నిర్మించారు. అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగారం, నైనిక అనసూయ కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది.