Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గతేడాది ‘మధగజరాజ’ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విశాల్,అంజలి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘మకుటం'(Makutam). ఈ చిత్రాన్ని స్వయంగా విశాల్ డైరెక్ట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుండి అందరి అటెన్షన్ ని డ్రా చేసింది ఈ సినిమా. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు.

Makutam

కానీ కాంబినేషన్ క్రేజ్ కలిసొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ‘మకుటం’ సినిమాని భారీ పోటీలో కూడా ఈ ఆగస్టు 14కి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ధారుణంగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.08 cr
సీడెడ్ 0.03 cr
ఆంధ్ర(టోటల్) 0.06 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 0.17 cr

‘మకుటం'(తెలుగు వెర్షన్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ అడ్వాన్స్ బేసిస్ పైనే సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి రోజు నెగిటివ్ టాక్ ప్రభావం.. అలాగే పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఎవ్వరూ ఈ సినిమాని పట్టించుకోలేదు. కేవలం రూ.0.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ రూ.0.30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆగస్టు 15 హాలిడేని ఏమైనా వాడుకుంటుందేమో చూడాలి.

మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus