Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

దివంగత స్టార్ నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకపరిచయం అవసరం లేదు. ఆయన తనయుడు  మేఘాంశ్‌ శ్రీహరి(Meghamsh Srihari) హీరోగా ఎంట్రీ ఇచ్చి వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త సినిమా ‘ఆస్మాన్’ ప్రారంభమైంది. శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Meghamsh Srihari

తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో కూడా రూపొందనుంది ‘ఆస్మాన్’.ఈ ఆగస్టు 15న శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోష‌న్ పోస్ట‌ర్ ను గ‌మ‌నిస్తే.. పెద్ద అర‌చేయి మ‌ధ్య‌లో హీరో మేఘాంశ్ కాగ‌డా ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉండటం, ఆ అర‌చేతికి సంబంధించిన నుదురు, దానిపై డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన బొట్టును కూడా మోష‌న్ పోస్ట‌ర్‌లో ఉండటాన్ని గమనించవచ్చు.

అర‌చేయి చుట్టూ జ‌నాలంద‌రూ కాగడాల‌ను ప‌ట్టుకుని నిలుచున్నారు. అస‌లు అర‌చేయి ఎవ‌రిది? మేఘాంశ్ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఈ మోషన్ పోస్టర్ సక్సెస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ కార్యక్రమంలో శాంతి శ్రీహరి మాట్లాడుతూ .. “‘మేఘాంశ్ పై నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్‌ని కూడా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వర్క్ చేయిస్తున్నారు. శ్రీహరి గారు కూడా అలానే నటించేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి.

మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న రామ్ నందన్‌కి థాంక్స్. ఈ మూవీకి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూశాన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది. శశాంక్ అయితే మేఘాంశ్‌ని మరింత కేరింగ్‌గా చూసుకుంటాడు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న మీడియాకి, నిర్మాతలకు థాంక్స్” అంటూ తెలిపారు.

హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘ఆస్మాన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది. రాయంచ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ గారి బీజీఎం అద్భుతంగా ఉండబోతోంది. మిగతా విషయాలన్నీ మున్ముందు ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడతాను’ అని అన్నారు.

దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో వస్తామ’ని అన్నారు.

నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. సెట్‌లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన డిస్కో శాంతి మేడంకి థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కాన్సెప్ట్ పోస్టర్ నుంచీ మాకు మంచి పాజిటివ్ వైబ్ వస్తోంది. కొన్ని రోజుల్లోనే షూట్ పూర్తి అవుతోంది. మాకు ఆడియెన్స్ నుంచి ఆదరాభిమానాలు కావాలి. శ్రీహరి గారి జయంతి సందర్భంగా మా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం ఆనదంగా ఉంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ లాంటి చిత్రం తెలుగులో చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్‌కి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

కెమెరామెన్ షోయబ్ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రామ్ మాకు ఈ కథను చాలా ఎక్కించారు. మేఘాంశ్ గారు పాత్రకు ప్రాణం పోస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ .. ‘శ్రీహరి గారితో నేను ‘వీకెండ్ లవ్’ అనే సినిమాను చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శ్రీహరిలానే మేఘాంశ్ ఎంతో ఎనర్జీగా, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు’ అని అన్నారు.

డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus