Anasuya: అల్లు అర్జున్ హీరో ఏంటి… సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!

  • July 13, 2023 / 07:51 PM IST

బుల్లితెర యాంకర్ గా వెండితెర రంగమ్మత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఓవెలుగు వెలిగినటువంటి అనసూయ అనంతరం వెండితెరపై సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ వివాదాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఈమె పలువురు హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు తీవ్రస్థాయిలో వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

ఇక అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి పుష్ప 2సినిమాలో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని అనసూయ అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నటువంటి ఈమె ఒకానొక సమయంలో అల్లు అర్జున్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఇందుకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ గెటప్ గురించి కొన్ని సంవత్సరాల క్రితం అనసూయ మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్ హీరో ఏంటి అంటూ ఆయన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో ఒక సాంగ్ చేశారు.

ఆ పాటలో అసలు చూడలేకపోయాను అంటూ అల్లు అర్జున్ గురించి తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. అయితే అప్పట్లోనే ఈ విషయం సంచలనంగా మారింది. అయితే అనసూయకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రస్తుతం ఫైర్ అవుతున్నారు మరి ఈ వీడియో పై (Anasuya) అనసూయ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus