మరో అగ్ర కథానాయకుడి చిత్రంలో అనసూయ

  • March 10, 2018 / 08:13 AM IST

ఇటీవల ఓ కుర్రాడు తాను వాకింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నాడన్న కోపంతో ఆ బుడ్డోడ్ని కొట్టడంతోపాటు ఫోన్ కూడా పగలుకొట్టిందన్న కారణంగా సోషల్ మీడియాలో కోపాగ్నికి గురై.. ఆ హీట్ భరించలేక ఫేస్ బుక్, ఇన్శ్టా గ్రామ్, ట్విట్టర్ నుంచి తన ఎకౌంట్స్ ను డీయాక్టివేట్ చేసి డిజిటల్ వరల్డ్ కి దూరంగా ఉంటూ ఎప్పట్లానే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న అనసూయకి తాజాగా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట. ఆ భారీ ఆఫర్ ఇచ్చిన దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియనప్పటికీ.. ఆ సినిమా త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందట. బుల్లితెరపై పలు చానల్స్ లో ఆల్రెడీ పదుల సంఖ్యలో షోస్ చేస్తూ యమ బిజీగా ఉంటున్న అనసూయ, అదే సమయంలో వెండితెరపైనా “విన్నర్, గాయత్రి” చిత్రాల ద్వారా మెరుస్తూ ఉంది.

అమ్మడు నటించిన తాజా చిత్రం “రంగస్థలం” మార్చి 30న విడుదలవుతుండగా.. ఈ చిత్రంలో సమంత స్నేహితురాలిగా, రామ్ చరణ్ కోసం పరితపించే రంగమ్మత్తగా అనసూయ కనిపించనుంది. ఆమె పాత్రతోపాటు అమ్మడి అందాలు కూడా సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాయట. ఈ సినిమా రిలీజైతే అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత బిజీ అయిపోతుందట. చూస్తుంటే.. అనసూయమ్మ కాస్త మంచి ప్లానింగ్ తోనే ముందుకెళుతున్నట్లుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus