‘జబర్దస్త్’ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. అక్కడితో ఈమె సరిపెట్టుకోలేదు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి ఈమె రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈమె తాజాగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళింది. ఇక ఈమెను చూడటానికి అభిమానులు ఎగబడి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో అనసూయ మెరిసిపోయింది. అయితే జనం మధ్య నుండీ తప్పించుకుని షాపింగ్ మాల్ వద్దకు వెళ్ళడానికి ఆమె చాలా కష్టపడింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు పట్టుకుని సెల్ఫీ అంటూ ఆమె మీద పడిపోయారు.
అయినప్పటికీ ఆమె ఓపిగ్గా వారందరికీ సెల్ఫీలు ఇస్తూ వచ్చింది. ఇక షాపింగ్ మాల్ వాళ్ళు.. అనసూయ మీద ఎవ్వరూ పడకుండా జాగ్రత్తగా దగ్గరుండి తీసుకెళ్ళారు. అలా అభిమానుల మధ్యలో షాపింగ్ మాల్‌ను ఓపెనింగ్ చేసింది. అయితే ఈ షాపింగ్ మాల్ కు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా వచ్చింది. అయితే ఆమెను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అలా హీరోయిన్ అనుపమ నే పక్కకు నెట్టేసింది రంగమ్మత్త.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!