కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. కొత్త ఏడాదిలో కూడా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలంతా కూడా ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా యాంకర్ అనసూయ తనలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ చెప్పి షాకిచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఓ కార్యక్రమం నిమిత్తం కర్నూలుకి వెళ్లాలని ఉదయాన్నే లేవగా.. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు చెప్పింది.
వీలైనంత త్వరగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. ఆ రిపోర్ట్ మీతో పంచుకుంటా అంటూ అభిమానులకు తెలిపింది. ఈ మధ్యకాలంలో తనను కలిసి వాళ్లని కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ మెగా ఫ్యామిలీలో టెన్షన్ పుట్టిస్తోంది. మెగా డాటర్ నీహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతుంది అనసూయ. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ను లాంఛనంగా మొదలుపెట్టారు. ఆ సమయంలో అనసూయ,
నీహారిక కలవడంతో ఇప్పుడు నీహారికకు కూడా కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమోననే టెన్షన్ కలుగుతోంది. మరి నీహారిక ఈ విషయంపై స్పందిస్తుందేమో చూడాలి.