Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రామాయణ'(Ramayana) ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. సాయి పల్లవి సీతగా నటించిన ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో ‘కేజీఎఫ్’ హీరో యష్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ సూర్పణకగా నటించింది. ట్రైలర్ అయితే యావరేజ్..గానే ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కాకపోతే ‘ఆదిపురుష్’ తో పోల్చి.. దీనికి హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు కొంతమంది.

Ramayana

దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ తో 2 పార్టులుగా ‘రామాయణ్’ ని రూపొందిస్తున్నారు. అయితే ‘రామాయణ్’ కి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడినట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘రామాయణ్’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. హిందుత్వ వాదులు ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఢిల్లీకి చెందిన శ్రీ‌రామ్‌లీలా సంఘ్ మ‌హావీర్ సంస్థ ప్ర‌తినిధులు ఉండటం గమనార్హం. ట్రైలర్ రిలీజ్ అయ్యాక వారు ‘రామాయ‌ణ్’ నిర్మాత‌కు వార్నింగులు ఇస్తూ లేఖలు పంపడం అనేది అందరికీ షాకిచ్చే అంశంగా చెప్పుకోవాలి.

‘ ‘రామాయణ్’ ట్రైల‌ర్ చూశాక తమ మైండ్లో అనేక ప్రశ్నలు రేకెత్తాయని, ముఖ్యంగా నటీనటుల వ‌స్త్రాలంక‌ర‌ణ అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని వారు పేర్కొన్నారు. అంతేకాదు రామాయ‌ణంలోని పాత్ర‌ల తీరు కరెక్ట్ గా ఉందా? లేక భావోద్వేగాల పేరు చెప్పి నచ్చినట్టు మార్చేశారా? రామాయణ్ ని ఎవరు ఎన్నిసార్లు తీసినా పర్వాలేదు. కానీ దానిని వక్రీకరించే విధంగా తీస్తే మాత్రం సహించమని… కాబట్టి రిలీజ్ కు ముందు త‌మకి పూర్తిగా సినిమా చూపించి, ఆమోదం పొందాకే విడుద‌ల చేయాలంటూ’ వారు లేఖలో పేర్కొన్నారు.

‘కుదరని పక్షంలో థియేట‌ర్ల వద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తామంటూ’ వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతానికైతే శ్రీ‌రామ్‌లీలా సంఘ్ మ‌హావీర్ సంస్థ ప్ర‌తినిధుల వార్నింగులని ‘రామాయణ్’ మేకర్స్ సీరియస్ గా అయితే తీసుకోలేదు. రిలీజ్ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే వారి వార్నింగ్ వల్ల ‘రామాయణ్’ కి మరింత పబ్లిసిటీ దొరికిందని చెప్పుకోవచ్చు.

రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus