బుల్లి తెరపై తిరుగులేని యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్న అనసూయ సాధారణ గృహిణిగా మారిపోయి ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎప్పుడు గ్లామర్ దుస్తులలో కనిపించి అందరినీ సందడి చేసే అనసూయ సాంప్రదాయ దుస్తులలో గృహిణిగా భర్త క్షేమం కోసం వటసావిత్రి వ్రతం చేశారు.
మూడు రోజుల పాటు కఠిన ఉపవాసంతో అనసూయ ఈ వ్రతం చేసినట్లు తెలుస్తోంది. ఈమె ఎంతటి సెలబ్రిటీ అయినప్పటికీ ఒక సాధారణ గృహిణిగా తన భర్త క్షేమం, ఐశ్వర్యం కోసం ఈ వటసావిత్రి వ్రతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్రతం చేయడం కోసం అనసూయ మూడురోజుల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదట. ఈ క్రమంలోనే అనసూయ వ్రతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ ఫోటోలో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
అనసూయ ఏంటి నువ్వు కూడా ఇలాంటి వ్రతాలు చేస్తావా? అంటూ కొందరు ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మామూలుగా వటసావిత్రి వ్రతం తన భర్త క్షేమం కోసం మహిళ పౌర్ణమిరోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా అనసూయ పౌర్ణమి కంటే ముందుగానే ఈ వ్రతం ఆచరించారు. వచ్చే నెల 14వ తేదీ పౌర్ణమి కావడంతో ఆ రోజు చేయాల్సిన వ్రతం అనసూయ ముందుగా చేయడంతో కొందరు ఇలా ముందుగా వ్రతం చేయడం ఏంటి అని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
1
2
3
4
5
6
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!