యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తాజాగా ప్రియాంక చోప్రా నటిస్తున్న సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా స్త్రీ, పురుష సమానత్వం గురించి మాట్లాడినటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేశారు. ఇలా ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె పలు కామెంట్స్ చేశారు.
నా ఉద్దేశం కూడా ఇదే ఇంట్లో అందరూ ఒక టీం గా పనిచేయడం ఎంతో అవసరం ఒకరినొకరు గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం వంటి వాటితోనే ఇలాంటివి సాధ్యమవుతాయి.అయితే చాలామంది ఇళ్లలో ఇలాంటివి కనిపించవు ఒకవేళ కనిపించిన వారిపై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతూ ఉంటాయని ఈమె తెలియజేశారు.కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటూ అనసూయ వెల్లడించారు. అనసూయ ఇలాంటి పోస్ట్ చేయడంతో నేటిజన్స్ యదా విధిగా తనపై ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక నేటిజన్ మేడం కుటుంబాన్ని ఎలా పోషించాలి తన భార్యకు ఎలా వండి పెట్టాలో మీ పిల్లలకు నేర్పించండి.ఎందుకంటే వచ్చే భార్య సంపాదిస్తుంది కనుక ఇంటిని చక్కబెట్టడం ఎలాగో మీ పిల్లలకు నేర్పండి అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై మండిపడిన అనసూయ సదరు నెటిజన్ కు తన స్టైల్ లో సమాధానం చెప్పారు. తప్పకుండా నేర్పిస్తాను ప్రస్తుతం నా కొడుకుకు 11 సంవత్సరాలు వయసు తను నాకు కిచెన్ లో సహాయం చేస్తాడు.
నాకు (Anasuya) సహాయం చేయడమే కాకుండా కుటుంబాన్ని పోషించడం, కూడా నా పిల్లలకు ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను. ఇక నా కుమారుడు వారి భార్య పిల్లలు ఎలా జీవించాలని నువ్వు చెప్పాల్సిన పనిలేదు…. నేను చెప్పాల్సిన పనిలేదు ఎవరి జీవితం వారి చేతిలో ఉంటుంది. ఇలా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి అంటూ అనసూయ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!