నేటి యాంకర్లకు హీరోయిన్లకు సమానంగా ఫాలోయింగ్ ఉంది. సంప్రదాయ దుస్తులతో బుల్లితెరలో సందడిచేసే యువ యాంకర్ లాస్య షార్ట్ ఫిలిమ్స్ తో అభిమానులను సొంతం చేసుకుంది. ‘రాజా మీరు కేక’ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టక ముందే ఆమెపై అనేక రూమర్లు వచ్చాయి. రహస్యంగా తోటి యాంకర్ రవిని పెళ్లి చేసుకుందని, యువ హీరో రాజ్ తరుణ్ తో కళ్యాణం జరిగిందని కొన్ని నెలల క్రితం వార్తలు షికార్లు చేశాయి. వాటిని ఖండించిన లాస్య కొంతకాలం మీడియాకు దూరంగా ఉంది. నిన్న ఉదయం తన నిశ్చితార్ధం గురించి ప్రకటించి ఆశ్చర్యపరిచింది.
మహారాష్ట్రకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి తో లాస్య ఎంగేజ్ మెంట్ నిన్న సాయంత్రం వైభవంగా జరిగింది. అనంతరం తమది ప్రేమ వివాహమని ఓ ఫోటో ద్వారా వెల్లడించింది. ఈ ఫొటోలో లాస్య చేతిపై ‘మంజు’ అని, మంజునాథ్ చేతిపై ‘చిన్ని’ అని రాసి ఉంది. అంటే లాస్య ముద్దుపేరు చిన్ని అన్నమాట. దీంతో ఆమెపై వచ్చిన అన్ని రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది ? పెళ్లి చేసుకున్నతర్వాత నటనకు గుడ్ బై చెబుతుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలో దొరకనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.