బుల్లితెర యాంకర్ రష్మీ ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా ఈటీవీ షోలలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రష్మీలా పదేళ్ల పాటు బుల్లితెరపై కెరీర్ ను కొనసాగిస్తున్న యాంకర్లు చాలా తక్కువమంది అనే సంగతి తెలిసిందే. తాజాగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను నా జీవితంలో ఒక మనిషికి క్షమాపణలు చెప్పాలని ఆమె అన్నారు. ఆ వ్యక్తి ఎవరో కూడా మీ అందరికీ తెలుసని రష్మీ చెప్పుకొచ్చారు.
ఆ వ్యక్తి తన ప్రతిభను స్టేజ్ పై చూపించాడని అయితే ఆ సమయంలో ఆ వ్యక్తికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు. అయితే ఈ ప్రయాణంలో అతను ఎన్నో విషయాలను చెప్పాడని రష్మీ పేర్కొన్నారు. మొదట పట్టించుకోకపోయినా ఆ తర్వాత అతని స్కిట్లు నాకు చాలా బాగా నచ్చాయని ఆమె కామెంట్లు చేశారు. ఆ కారణం వల్లే నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నానని రష్మీ తెలిపారు.
ఆరోజు ఆ వ్యక్తి చెప్పిన మాటలను పట్టించుకుని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రష్మీ కామెంట్లు చేశారు. ఆ బాబు మన ఆర్టిస్ట్ బాబు అని రష్మీ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన వేసిన వేషాల వల్ల యాక్టర్ బాబు రైటర్ బాబు అయ్యాడని ఆమె తెలిపారు. అతనిని మేము సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ అతను ఉన్నాడని రష్మీ కామెంట్లు చేశారు.
ఛాన్స్ ఇవ్వకపోతే కోసుకుంటా అని బెదిరించాడని ఆ కారణం వల్లే రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చామని రష్మీ కామెంట్లు చేశారు. అందుకు ఆడియన్స్ కు కూడా సారీ చెప్పాలని ఆమె అన్నారు. రష్మీ సరదాగా చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..