Love Today Review: లవ్ టుడే సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 25, 2022 / 10:10 AM IST

Cast & Crew

  • ప్రదీప్ రంగనాధన్ (Hero)
  • ఇవానా (Heroine)
  • సత్యరాజ్, రాధిక (Cast)
  • ప్రదీప్ రంగనాధన్ (Director)
  • కల్పతి ఎస్.అఘోరం (Producer)
  • యువన్ శంకర్ రాజా (Music)
  • దినేష్ పురుషోత్తమన్ (Cinematography)
  • Release Date : November 25th, 2022

జయం రవితో “కోమాలి” అనే చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయం సొంతం చేసుకున్నా దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ హీరోగా మారు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “లవ్ టుడే”. తమిళనాట ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి డబ్బింగ్ వెర్షన్ కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో లేదో చూద్దాం..!!

కథ: ప్రదీప్ (ప్రదీప్ రంగనాధ్) ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి.. తన సహోద్యోగి నికిత (ఇవానా)ను ప్రేమిస్తూ లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఆమె తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్)ని కలిసినప్పుడు.. ప్రదీప్ & నికిత తమ ఫోన్లను ఎక్స్ ఛేంజ్ చేసుకొని ఒక రోజంతా వాడాలని.. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకర్నొకరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ తనకు సమ్మతేమని చెబుతాడు.

దాంతో.. ప్రదీప్ ఫోన్ నికిత చేతిలో, నికిత ఫోన్ ప్రదీప్ చేతిలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ సీక్రెట్స్ ను దాచుకోవడానికి చేసిన ప్రయత్నాలు, బయటపడ్డ రహస్యాల కారణంగా ఎదురైన ఇబ్బందుల సమాహారమే “లవ్ టుడే”కథాంశం.

నటీనటుల పనితీరు: డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ కి లీడ్ రోల్ గా ఇది తొలి చిత్రమే అయినప్పటికీ.. నటుడిగా అతడికి ఉన్న ఈజ్ & డైలాగ్ డెలివరీలో చూపిన పరిణితి బాగున్నాయి. ముఖ్యంగా ప్రదీప్ మన పక్కింటి కుర్రాడిలా ఉండడం వలన.. ప్రతి ఒక్కరూ అతడి పాత్రకు, హావభావాలకు విపరీతంగా కనెక్ట్ అవుతారు.

ఇవానా అందంగా కనిపించడమే కాక.. అభినయ సామర్ధ్యంటోను ఆకట్టుకుంది. నవతరం యువతిగా ఆమె నటన, ఎమోషనల్ సీన్స్ లో ఆమె హావభావాలు కట్టిపడేస్తాయి. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆమెకు మరో ప్లస్ పాయింట్.

సత్యరాజ్ ఒక టిపికల్ ఫాదర్ రోల్లో కామెడీ అదరగొట్టగా.. రాధిక ఒక టిపికల్ మదర్ రోల్లో తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. యోగిబాబు చాలా సీరియస్ రోల్లో కామెడీ పండించి ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రదీప్ రంగనాధ్ రాసుకున్న కథ-కథనం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఫోన్ ఎక్స్ ఛేంజ్ అనే చాలా సింపుల్ కాన్సెప్ట్ ను అద్భుతమైన స్క్రీన్ ప్లేటో రసవత్తరంగా నడిపించిన తీరు ప్రశంసనీయం. ప్రెజంట్ జనరేషన్ రిలేషన్ షిప్స్ ఎలా ఉంటున్నాయి, సోషల్ మీడియాలో మెసేజస్ అనేవి అమ్మాయిలను ఎంత ఇబ్బందిపెడుతుంటాయి, అబ్బాయిలు అమ్మాయిల్ని సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యే విధానం గట్రా భలే ఆసక్తికరంగా ప్రెజంట్ చేసిన విధానం అభినందనీయం. ఒక కథానాయకుడిగా, దర్శకుడిగా, కథకుడిగా ప్రదీప్ రంగనాధన్ అఖండ విజయం సాధించాడనే చెప్పాలి.

సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, డి.ఐ, సౌండ్ డిజైన్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల అనువాదరూపాన్ని చూసిన ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా చేసింది.




వీళ్ళందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన వ్యక్తి యువన్ శంకర్ రాజా.. సరదా సన్నివేశాలకు ఎంత ట్రెండీ మ్యూజిక్ అందించాడో.. ఎమోషనల్ & లవ్ ఎపిసోడ్స్ కు అతడి నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విశ్లేషణ: తెలుగులో “ఈరోజుల్లో, బస్టాప్” చిత్రాలను ఏ స్థాయిలో ఎంజాయ్ చేశారో.. ఇప్పుడు “లవ్ టుడే”ను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. యూత్ కనెక్ట్ మాత్రమే కాక సోషల్ మీడియా వల్ల నష్టాలను కూడా హైలైట్ చేసి చూపించిన ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టడం ఖాయం.




రేటింగ్: 3/5




Click Here To Read In ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus