Thodelu Review: తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 25, 2022 / 10:06 AM IST

Cast & Crew

  • వరుణ్ ధావన్ (Hero)
  • కృతి సనన్ (Heroine)
  • దీపక్ డోబ్రియాల్ (Cast)
  • అమర్ కౌశిక్ (Director)
  • దినేష్ విజయ్‌ ,జిఓ స్టూడియోస్ (Producer)
  • సచిన్ -జిగర్ (Music)
  • జిష్ణు భట్టాచార్జీ (Cinematography)

“స్త్రీ, బాలా” వంటి చిత్రాలతో సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరొందిన అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “భేడియా”. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో “తోడేలు” అనే టైటిల్ తో అనువదించారు. వరుణ్ ధావన్ – కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం హిందీతోపాటు పలు దక్షిణ భారత ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ ఫిక్షనల్ ఫిలిమ్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో రోడ్ వేయడానికి వచ్చిన ఇంజనీర్ భాస్కర్ (వరుణ్ ధావన్). రోడ్డు వేసే ప్లానింగ్ లో భాగంగా అడవిలో రెక్కీ చేస్తుండగా.. భాస్కర్ ను ఒక తోడేలు కరుస్తుంది. అప్పట్నుంచి ప్రతిరోజూ రాత్రి భాస్కర్ తోడేలులా రూపాంతరం చెందుతుంటాడు. దాంతో ట్రీట్మెంట్ కోసం జంతువుల డాక్టర్ అయిన అంకిత (కృతి సనన్) వద్దకు వెళతారు.

అసలు భాస్కర్ తోడేలులా ఎందుకు మారుతున్నాడు? అంకిత ట్రీట్మెంట్ ఏమైనా ఉపశమనం కలిగించిందా? లేదా? అనేది “తోడేలు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: వరుణ్ ధావన్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ భలే ఉన్నాయి. ఓ సాధారణ కుర్రాడిగా నవ్విస్తూనే.. తోడేలుగా మారే తరుణంలో భయపెడుతూ థ్రిల్ చేశాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.

కృతి సనన్ నటిగా పర్వాలేదు అనిపించుకుంది కానీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & లుక్ సినిమాకి మైనస్ గా మారాయి. వరుణ్ తో కెమిస్ట్రీ కూడా అంతగా వర్కవుటవ్వలేదు.

కమెడియన్ అభిషేక్ బెనర్జీ సింగిల్ లైనర్స్ & స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. రాజ్ కుమార్ రావు & శ్రద్ధాకపూర్ క్యామియోలను సరిగా వాడుకోలేదు చిత్రబృందం.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ జిష్ణు భటాచార్య టేకింగ్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. వి.ఎఫ్.ఎక్స్ టీం పనితనాన్ని కూడా మెచ్చుకోవాలి. పరిమిత బడ్జెట్లో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు ఈ ఇద్దరూ. సచిన్-జిగర్ సంగీతం సోసోగా ఉంది. క్యాచీ ట్యూన్స్ లేకపోవడం మైనస్.

దర్శకుడు అమర్ కౌశిక్ ఎప్పట్లానే ఓ సాధారణ పాయింట్ ను అసాధారణంగా ప్రెజంట్ చేశాడు. అయితే.. ఈ సినిమాలో కాస్త లాజికల్ సోల్యూషన్స్ అవసరం ఉండడంతో.. మునుపటి రెండు సినిమాలు పండినంతగా ఈ సినిమాలో హాస్యం పండలేదు. అలాగే.. జస్టిఫికేషన్ విషయంలో కూడా తడబడి, చుట్టబెట్టేశాడు. అందువల్ల ఆడియన్స్ ను సంతుష్ట పరచలేకపోయాడు.




విశ్లేషణ: లాజిక్స్ ను పక్కన పెడితే “తోడేలు” ఒక టైమ్ పాస్ సినిమా. అయితే.. తెలుగు డబ్బింగ్ సరిగా కుదరకపోవడం, క్లైమాక్స్ జస్టిఫికేషన్ సరిగా లేకపోవడం, కృతి సనన్ లుక్ బాగోకపోవడం వంటి కారణాలుగా సినిమాకి తెలుగు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేరు.




రేటింగ్: 2/5




Click Here To Read In ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus