Balayya Songs: ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

నటసింహ నందమూరి బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఎన్నో అద్భుతమైన పాత్రలకు తన అసమాన నటనతో జీవం పోశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తులు, అభిమానులు ఆయణ్ణి ముద్దుగా, ప్రేమగా బాలయ్య అని పిలుస్తారు.. ‘బంగారు బుల్లోడు’ లో ‘అయినవాళ్లు బాలయ్య అంటారు..పరాయి వాళ్లు బాలకృష్ణ అంటారు’ అని చెప్పినట్టుగా.. అయితే బాలయ్య అనే పదంతో, జై బాలయ్య అనే నినాదంతో అభిమానులకి అవినాభావ సంబంధం ఉంది.. జై బాలయ్య అంటే కేవలం స్లోగన్ మాత్రమే కాదు మా ఎమోషన్ అంటారు ఫ్యాన్స్.. అలాగే అభిమానులు అందరికీ ఉంటారు..

మా బాలయ్య బాబుకి మాత్రం భక్తులు ఉంటారు అంటుంటారు.. క్రికెట్ స్టేడియం, పబ్, మాల్, కాలేజ్, స్కూల్.. అంతెందుకు..అనకాపల్లి నుండి ఆస్ట్రేలియా వరకు ప్లేస్ ఏదైనా బాలయ్య బేస్ ఉండాల్సిందే అంటారు. ఇప్పుడు వాళ్ల ఆనందం రెట్టింపయ్యేలా.. ‘వీర సింహా రెడ్డి’ నుండి మాస్ ఆంథెమ్ వచ్చేసింది. అది కూడా తమ అభిమాన నటుడి పేరు మీద.. ‘అఖండ’ లో ‘జై బాలయ్య’ పాటతో ఊపు ఊపిన బాలయ్య పేరు మీద ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ఏంటో చూద్దాం..

1) ‘లారీ డ్రైవర్’.. ‘బాలయ్య బాలయ్య జయమ్మ జయమ్మ’ సాంగ్ అయితే ఓ ఊపు ఊపింది.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ సాంగ్..

2) బంగారు బుల్లోడు.. ‘తధిగినతోం తధిగినతోం బాలయ్యో..ఇటు రావయ్యో’..

3) ‘నరసింహ నాయుడు’ లోని ‘లక్స్ పాప’ పాటలోని చరణంలో ‘హరేరామ హరేకృష్ణా.. బెండుతీసేయ్ బాలకృష్ణా’ అని వస్తుంది..

4) ‘సీమసింహం’ మూవీలో ‘కోకా రైకా’ పాట చివర్లో ‘బాలయ్యో..ఏం గోలయ్యో’ అని వస్తుంది..

5) ‘మహారథి’ లో ‘ఒట్టు పెట్టి చెప్పుతాను’ పాటలో కోరస్‌గా పలుసార్లు ‘బాలకృష్ణ’ అని వస్తుంది..

6) ‘మిత్రుడు’ మూవీలో ఫస్ట్ సాంగ్ అను పల్లవిలో ‘గోపాల బాలకృష్ణా అంటూ వాయించెయ్ నా మురళిని’ అని కూడా వస్తుంది..

7) ‘అఖండ’.. అయ్యా బాలయ్య అంటూ మొదలయ్యే ఈ సాంగ్.. ‘యా యా జైై బాలయ్య’ అంటూ ఏ రేంజ్‌లో రచ్చ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేసింది..

8) ‘వీర సింహా రెడ్డి’.. ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు.. తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారి కోసం.. అగ్గిమంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేడే లేడయ్యా.. ఆ మెలతాడు కట్టిన మొగోడింకా పుట్టనేలేదయ్యా.. జై బాలయ్య.. జై జై బాలయ్య’’.. ఈ లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది..

నందమూరి పేరు మీద పాటలు..

బాలయ్య, బాలకృష్ణ, జై బాలయ్య పేర్ల మాదిరిగానే నటసింహం ఇంటిపేరు నందమూరి మీద కూడా పాటలొచ్చాయి..

1) ‘సమర సింహా రెడ్డి’.. ‘నందమూరి నాయకా.. అందమైన కానుకా’.. ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది..

2) ‘గొప్పింటి అల్లుడు’.. ఈ మూవీలో ‘నీ హైట్ ఇండియా గేటు’ అంటూ బాలయ్య, సిమ్రాన్‌ని టీజ్ చేసే సాంగ్ ఒకటి ఉంటుంది.. సెకండ్ చరణంలో.. ‘నందమూరి వాణ్ణే.. కురిపిస్తా మార్వెలెస్ ప్రేమ’ అని వస్తుంది..

3) ‘నరసింహ నాయుడు.’. ‘చిలక పచ్చ కోకా’.. పాటలో.. ‘చెయ్యేస్తే పులకరింతలే.. ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే’ అనే లైన్ ఉంటుంది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus