2వ వారం నామినేషన్స్ అప్పుడు నటరాజ్ మాస్టర్ వచ్చి ఒక గుంటనక్క వచ్చి హౌస్ లో అందరికీ చెప్పింది. ఈ నక్క మాటలు విని మేకలన్నీ నామినేట్ చేస్తున్నాయి అంటూ డైలాగ్ విసిరారు. అప్పట్నుంచీ బిగ్ బాస్ హౌస్ లో గుంటనక్క ఎవరు అనేది సస్పెన్స్ గానే అయ్యింది. అంతేకాదు, లాస్ట్ వీకండ్ లో నాగార్జున వచ్చి నటరాజ్ మాస్టర్ ని ఆ గుంటనక్క ఎవరు మాస్టర్ అని అడిగినా కూడా మాస్టర్ నెక్ట్స్ వీక్ గ్యారెంటీగా చెప్తాను అంటూ దాటేశారు. అయితే, 4వ వారం హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ తో అయిన నామినేషన్స్ లో రవి గుంటనక్కని నేనే అని హౌస్ లో అందరికీ కూడా తెలుసు మాస్టర్ అని మాస్టర్ ని నామినేట్ చేశాడు.
అక్కడే నటరాజ్ మాస్టర్ అసలు నువ్వని ఎందుకు అనుకుంటున్నావ్ అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూని నేను మర్చిపోలేకపోతున్నా, ఎవరు గుంటనక్క అన్నా కూడా అది నన్ను వెంటాడుతోంది అంటూ మాట్లాడాడు రవి. నామినేషన్స్ తర్వాత కూడా దీనిపైన క్లారిటీ తీస్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడే మాస్టర్ నువ్వు ఎవర్నీ ఇన్ఫులెన్స్ చేయకు అంటూ ఇండైరెక్ట్ గా గుంటనక్క రవి అనే చెప్పారు మాస్టర్. ఇదే విషయాన్ని విశ్వతో డిస్కస్ చేశాడు రవి. మాస్టర్ ఈ మాట అనగానే వాడికి మంచి పేరు పెట్టారుగా అంటూ నువ్వు అన్నావా అని అడిగాడు రవి.
దీనికి విశ్వ అస్సలు ఆమాట నా నోటి నుంచే రాలేదని చెప్పాడు. ఆ తర్వాత రాత్రిపూట ఫన్నీగా కాసేపు మాట్లాడుకున్న రవి అండ్ మాస్టర్ లు ఇద్దరూ అక్కడ కొంతమందికి పెట్టిన పేర్లు గురించి చెప్పుకున్నారు. ఇందులో భాగంగా పీకాక్ అని పేరు పెట్టిన లహరి ఎగిరిపోయింది అంటూ మాస్టర్ మాట్లాడారు. అలాగే, హౌస్ లో ఒక కుందేలు కూడా ఉందని, ఊసరవెల్లి కూడా రంగులు మారుస్తూ ఉంటుందని చెప్పాడు. అక్కడే ఉన్న లోబోని ఎలుగుబంటితో పోలుస్తూ కాసేపు ఫన్ చేశారు నటరాజ్ మాస్టర్. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో గుంటనక్క ఎవరో తెలిసిందన్నమాట.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!