తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుమ.. బుల్లితెర స్టార్ యాంకర్‌గా సుమకి తిరుగు లేదు.. నటిగా, సింగర్‌గానూ సత్తా చాటారామె.. మలయాళీ అయినా కానీ అంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ప్రముఖ నటులు, దర్శకులు, నట శిక్షకులు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..సుమ, రాజీవ్ దంపతులకు రోషన్, మనస్విని అనే పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి..
రాజీవ్ తల్లిదండ్రులు, సోదరి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తనను ఎలా వదిలేస్తుందంటూ కామెంట్స్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా తన పనేదే తాను చేసుకుంటూ పోయారు.. తర్వాత పలు సినిమా ఫంక్షన్లలోనూ, సుమ హోస్ట్ చేస్తున్న షోలోనూ బెస్ట్ కపుల్ అంటే వీళ్లే అనుకునేంత ఆప్యాయంగా కనిపించి అవన్నీ పుకార్లని నిరూపించారు. కట్ చేస్తే.. సుమ తనకు భర్తంటే ఎంత ప్రేమో తెలియజేస్తూ షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రేమ గురించి కొత్తగా చెప్పాలా?.. చెప్పండి.. అసలేం జరిగిందంటే.. నవంబర్ 13న రాజీవ్ తన 54వ పుట్టినరోజుని జరుపుకున్నారు. భర్త బర్త్‌డేను దగ్గరుండి సెలబ్రేట్ చేశారు సుమ.. చిరునవ్వులు చిందిస్తూ.. సరదాగా బోటు షికారు కూడా చేశారు.. కేక్ కట్ చేయించి, భర్తతో కలిసి బోటులో షికారు చేస్తున్న బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై డియరెస్ట్ రాజా’ అంటూ ప్రేమ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..
క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారిందీ వీడియో.. సినీ, టీవీ సెలబ్రిటీలు, సుమ, రాజీవ్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు లవ్లీ కపుల్ అని కామెంట్స్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నారు.. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిసుగా అలరిస్తుండగా.. సుమ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు కూడా..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!