Suma: చేతికి సంకెళ్ళతో సుమ వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!

  • April 12, 2023 / 06:50 PM IST

బుల్లెట్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా ప్రస్తుతం కాస్త బుల్లితెరకు దూరమైనప్పటికీ సినిమా ఈవెంట్లతో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఏదైనా సినిమా ఈవెంట్ జరగబోతుంది అంటే అక్కడ తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే. సుమ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఆమెకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో బిజీగా మారిన సుమా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల కన్నా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

అయితే ఎంతో చలాకీగా అన్ని సినిమా కార్యక్రమాలలో పాల్గొనే సుమ (Suma) తాజాగా చేతికి సంకెళ్లతో దర్శనం ఇచ్చారు. ఇలా కారులో సుమ చేతికి సంకెళ్లు వేసి అరెస్టు చేసి తీసుకు వెళ్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి నిజంగానే సుమ అరెస్ట్ అయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ అని.

గత రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదల చేసే సమయంలో నాగచైతన్య డైరెక్టర్ వెంకట ప్రభును ఇదే స్టైల్ లో అరెస్టు చేసి తీసుకెళ్తూ ఈ సినిమా అప్డేట్ వదిలారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమను సైతం ఇలాగే సంకెళ్లతో బంధించి తీసుకెళ్లడంతో తప్పనిసరిగా ఇది కస్టడీ సినిమా ప్రమోషన్లలో భాగమేనని, ఈ సినిమా ఈవెంట్ కోసమే సుమను ఇలా తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూలో సుమ నాగచైతన్యను ఏ రేంజ్ లో ఆడుకుంటుందో తెలియాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus