దర్శకత్వ పర్యవేక్షణ… ఇది చాలా వెరైటీ కాన్సెప్ట్. ఎవరో తీసిన సినిమాకు, పై మెరుగులు దిద్ది రెడీ చేయడం. టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ రోజుల్లో అగ్ర దర్శకులు… తమ అసిస్టెంట్లు సినిమాలు చేస్తున్నప్పుడు వచ్చి పర్యవేక్షించేవారు. అయితే చాలా సినిమాల్లో ఈ పర్యవేక్షణ అనే పేరు టైటిల్ కార్డ్స్‌లో పడదు. అయితే కొన్ని సినిమాల వేస్తుంటారు. దాని వల్ల ఎంతో కొంత సినిమాకు బూస్టింగ్ వస్తుందిలే అనేది ఆలోచన. అంటే… హిట్ డైరక్టర్ పేరు.. పోస్టర్ మీద, ప్రమోషన్స్‌లో ఉంటే సూపర్ కదా. అయితే ఇలాంటి ఆలోచన అనిల్ రావిపూడిని ఇరుకున పెట్టేసింది.
అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ క్రమంలో ఆయన నుండి గతేడాది వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ ఫన్నీ డైలాగ్ రాసుకొచ్చారు. అది మహేష్‌బాబు నోటివెంట టపానులా పేలింది కూడా. అదేం డైలాగ్ అంటే… ‘ఇతరులు చేసిన సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ టైటిల్ కార్డు వేయిస్తే ఆ కిక్కే వేరు’. ఈ డైలాగ్‌కి ఆరోజుల్లో భలే చప్పట్లు మోగాయి. ఇప్పుడు అదే డైలాగ్ అనిల్ రావిపూడి గుండెల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కారణం ఆయన దర్శకత్వ పర్యవేక్షణ వహించిన ‘గాలిసంపత్’ తుస్సుమనడమే.
‘గాలి సంపత్’ సినిమాకు అనిల్ రావిపూడి సమర్పకుడు. దీంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారట. అతని ట్రాక్ రికార్డు చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ఆదరించలేదు. దీంతో దర్శకుడిగా స్టార్‌గా ఎదిగిన అనిల్ రావిపూడి… నిర్మాతగా ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ సినిమా ఫలితంతో తనకు సంబంధం లేదన్నట్లు ఇప్పుడు ఉంటున్నాడట. దర్శకత్వ పర్యవేక్షణ అనే పేరు పెట్టుకొని.. వరుసగా సినిమా ప్రచారంలో తిరిగిన అనిల్… ఇప్పుడు ఏం సంబంధం లేదంటే ఎలా. అందుకే అతని డైలాగే అతనికి ఇబ్బంది పెట్టేలా మారింది అంటున్నారు నెటిజన్లు.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!