Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

అనిల్ రావిపూడి(Anil Ravipudi) అంటేనే వినోదానికి కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే తన బలం అని నమ్మి, వరుస హిట్లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్.. సంక్రాంతి సీజన్‌ను అస్సలు వదులుకోడు. 2026 సంక్రాంతికి ఇప్పటికే ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్, ఇప్పుడు 2027 సంక్రాంతి కోసం కూడా మరో బ్లాక్ బస్టర్ కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు.

Anil Ravipudi

అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్‌తోనే అనే క్లారిటీ వచ్చింది. వీరి కాంబోలో రాబోయేది 5వ సినిమా! ఈ కాంబినేషన్ అంటే మినిమం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు డిసైడ్ అయిపోయాయి.’F2′ ‘F3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్ గారు'(క్యామియో).. ఇలా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఈసారి వీరితో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా చేతులు కలిపాడు.

అనిల్ మార్క్ కామెడీని ఫహద్ ఫాజిల్ తనదైన శైలిలో ఎలా పండిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇక ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి ‘బావ బావమరిది.. వాళ్ళ బాండింగ్, వాళ్లకి ఫ్యామిలీ లైఫ్ లో వచ్చిన సమస్యలు.. వాటికి వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు?’ అనే థీమ్ తో ఉంటుందట.

వెంకటేష్ కి బావమరిది పాత్రలో ఫహాద్ కనిపించబోతున్నాడు అని అర్ధం చేసుకోవచ్చు.ఈ సినిమాకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డాడట అనిల్ రావిపూడి.

రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus