Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

సంక్రాంతికి ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఉండాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకునేవారు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా ఉంటే చాలు అనే రేంజ్..కి వచ్చారు. కాదు కాదు దర్శకుడు అనిల్ రావిపూడి అలా చేసుకున్నాడు అని చెప్పాలి. ‘ఎఫ్ 2’ ‘సరిలేరు నీకేవ్వరు’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇలా సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే. బయ్యర్స్ కి భారీ లాభాలు అందించాయి.

Anil Ravipudi

ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాలకి కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ని అనిల్ రావిపూడి రీజనల్ మూవీస్ తో తీసుకొస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరో ఒకరు ఉంటే చాలు సంక్రాంతి సీజన్ ను ఏలేయొచ్చు అని ప్రతి సినిమాకి ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… 2027 సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సినిమా రానుంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇది. ఫహాద్ ఫాజిల్ కూడా ఓ హీరోగా నటించే అవకాశం ఉంది.

వెంకటేష్ సరసన కీర్తి సురేష్, పూజా హెగ్డే.. ఫహాద్ సరసన ఆషిక రంగనాథ్..లు హీరోయిన్లుగా ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ముందుగా ప్రాజెక్టునే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా టైటిల్ ఇది అంటూ ఓ టాక్ మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు.. ఈ క్రేజీ ప్రాజెక్టుకి  ‘శ్రీమతి లలిత రెడ్డి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తుంది.

అయితే అనిల్ ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే అతను సంక్రాంతికి తీసుకొచ్చే సినిమాల టైటిల్స్ లో ఎక్కువ శాతం పండుగ వైబ్స్ ఉండేలా చూసుకుంటాడు. ‘శ్రీమతి లలిత రెడ్డి’ టైటిల్ లో అలాంటి వైబ్స్ లేవు. మరి ఈ టైటిల్..లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి?

ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus