ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక రణబీర్ మధ్య కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే రష్మిక పాత్ర కంటే ఈ సినిమాలో నటించిన మరో నటి తృప్తి డిమ్రి పాత్ర మరింత హైలెట్ అయింది అని చెప్పాలి.
ఇదివరకు ఈమె పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాలో ఈమె కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం.
ఇక ఈ సినిమా విజయానికి ఈమె కూడా ఎంతో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ కు మూల కారణం అయినటువంటి తృప్తి ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా కోసం తృప్తి కేవలం 40 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
సినిమాకే ఈమె (Tripti Dimri) చాలా హైలెట్ అయింది అలాంటిది ఈమె రెమ్యూనరేషన్ మాత్రం ఇంత తక్కువ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మికకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందివ్వగా రణబీర్ కపూర్ కు 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక బాబీ డియోల్ ఈ సినిమా కోసం నాలుగు కోట్లు అనిల్ కపూర్ రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.