Animal: యానిమల్ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్ లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. యానిమల్ మూవీ ఒక థియేటర్ లో ఏకంగా 3 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

కెనడాలోని సిల్వర్ సిటీ థియేటర్ లో యానిమల్ మూవీ ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ త్వరలో రిలీజ్ కానుండగా ఓటీటీ వెర్షన్ కు 20 నిమిషాలు జోడించనున్నారని తెలుస్తోంది. యానిమల్ మూవీ ఓటీటీలో సైతం రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రణ్ బీర్ కపూర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

యానిమల్ సినిమా తెలుగు వెర్షన్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. యానిమల్ మూవీ సక్సెస్ తో రణ్ బీర్ కపూర్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. యానిమల్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా సీక్వెల్ ను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. యానిమల్ మూవీని ఇప్పటికే థియేటర్లలో చూసిన వాళ్లు సైతం ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

యానిమల్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో రణ్ బీర్ కపూర్ భవిష్యత్తు సినిమాల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. రణ్ బీర్ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. యానిమల్ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. సందీప్ రెడ్డి వంగా ఒకవైపు దర్శకునిగా సక్సెస్ అవుతూనే నిర్మాతగా సైతం మంచి లాభాలను అందుకుంటున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus