రణ్బీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కింది యానిమల్ సినిమా. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ యానిమల్ సినిమాను డైరెక్టర్ రూపొందించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. అయితే తాజా ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు భారతదేశం అంతటా హాట్కేక్లుగా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. హైదరాబాదీ సినీ ప్రముఖులు తమ అభిమాన స్క్రీన్లలో సినిమా చూసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. తాజాగా అన్ని ప్రధాన నగరాలలో యానిమల్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కొన్ని చోట్ల టికెట్ రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయట.
ఢిల్లీలో ఈ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.2,400లట. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే రూ. 2000 వరకు ఉందట. ఇక ఆయా రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ మేకర్స్ టికెట్ రేట్లను పెంచినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రంలో అయితే ఈ మూవీ టికెట్ ధర పరిమితంగానే ఉంది.
నార్త్ లోని ముఖ్య పట్టణాల్లోని మల్టీప్లెక్సుల్లో రూ. 500లకు తగ్గకుండా యానిమల్ టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. సౌత్ లో బెంగళూరులో భారీ రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగానే బెంగళూరు మాల్స్ లో టికెట్ రేట్లు ఎక్కువ. యానిమల్ (Animal) రాకతో ఈ రేట్లు 35 నుంచి 55 శాతం పెరిగాయి.