Animal: యానిమల్, సలార్ బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే జరిగేది ఇదేనా?

  • November 28, 2023 / 08:30 PM IST

యానిమల్, సలార్ సినిమాలు రెండు నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలు హిట్టైతే తర్వాత రోజుల్లో రిలీజ్ కానున్న సినిమాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. యానిమల్ రిలీజైన తర్వాత వారం హాయ్ నాన్న, ఎక్స్ట్రా అర్డినరీ మ్యాన్ రిలీజ్ కానున్నాయి.

యానిమల్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రం సంక్రాంతి కానుకగా రిలీజయ్యే సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. యానిమల్ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా సలార్ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

సలార్ మూవీ ట్రైలర్ డిసెంబర్ నెల 1వ తేదీన విడుదల కానుంది. అరోజు యూట్యూబ్ షేక్ కావడంతో పాటు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ అవుతాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్, ప్రభాస్ కెరీర్ లను ఈ సినిమాలు డిసైడ్ చేయనున్నారు. ఈ హీరోలు భవిష్యత్తు సినిమాలతో సైతం సంచలనాలు సృష్టించి మార్కెట్ ను షేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.

స్పిరిట్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కలిసి కనిపించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, రణ్ బీర్ కపూర్ లను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రేంజ్ లో ఉండగా రణ్ బీర్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉంది. (Animal) యానిమల్ సినిమా సక్సెస్ సాధిస్తే రణ్ బీర్, సందీప్ సినిమాల బడ్జెట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus