Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

సుకుమార్‌ – దేవి శ్రీ ప్రసాద్‌.. ఈ కాంబినేషన్‌ గురించి చెప్పడానికి వాళ్లు చేసిన సినిమాల విజయం మాత్రమే కొలమానం కాదు. ఇద్దరూ కలసి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన అద్భుతమైన పాటలు గురించి ఎంత చెప్పినా తక్కువ కాదు. అలాంటి కాంబినేషన్‌ ఇప్పుడు విడిపోతోబోతోంది. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించనున్న కొత్త సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడం లేదు అని చెబుతున్నారు. ఈ మేరకు మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో చర్చలు జరుగుతున్నాయట.

Rc17

చాలా రోజులుగా చర్చలు, రచనల స్థాయిలోనే ఉండిపోయిన సుకుమార్‌ – రామ్‌చరణ్‌ సినిమాకు ఎట్టకేలకు కొబ్బరికాయ కొట్టబోతున్నారట. దసరా సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారట. డిసెంబరు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందని చెబుతున్నారు. ఈ లోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు, కాస్టింగ్‌ పనులు చూస్తారట. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడి గురించి చర్చలు జరుగుతున్నాయట. అలా అనిరుధ్‌ రవిచంద్రన్‌ పేరు చర్చలోకి వచ్చిందట.

ఇప్పటివరకు సుకుమార్‌ సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ సొంత సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హీరోగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న ‘ఎల్లమ్మ’ షెడ్యూల్స్‌, టైమ్‌ లైన్స్‌లోనే సుకుమార్‌ – చరణ్‌ సినిమా ఉండటంతోనే మ్యూజిక్‌ డైరక్టర్‌ మార్పు అని చెబుతున్నారు. నిజానికి రామ్‌చరణ్‌ – అనిరుధ్‌ కాంబినేషన్‌లో చాలా ఏళ్ల క్రితమే రావాల్సింది. గతంలో ‘బ్రూస్‌ లీ’ సమయంలో ఈ టాపిక్‌ చర్చకు వచ్చింది. కానీ అప్పుడు కుదర్లేదు.

అయితే, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌తో సుకుమార్‌ – చరణ్‌ – అనిరుధ్‌ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని భోగట్టా. దీంతో చరణ్‌కి అనిరుధ్‌ బీజీఎం, మాస్‌ బీట్‌ పడితే ఎలా ఉండబోతోంది అనే ఊహల్లో అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట లెక్కల మాస్టారి టీమ్‌. అప్పుడెప్పుడో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైమ్‌ చరణ్‌ మీద ఓ ఇంట్రో సీన్‌ తెరకెక్కించారు సుకుమార్‌. అదేమైనా ఇప్పుడు వాడుకుంటారేమో చూడాలి..

మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus