Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

‘మా సినిమా కోసం మా హీరోగారు చాలా కష్టపడతున్నారు. ఆయన సీన్స్‌ లేకపోయినా సెట్స్‌లో వచ్చి కూర్చుని సినిమా బాగా వచ్చేలా చూసుకుంటున్నారు’ – ఈ మాటను చెప్పిన కొన్ని రోజులకు ఆ సినిమా వాయిదా పడుతోంది.. త్వరలో కొత్త డేట్‌ చెబుతాం అని చెప్పారు ప్రముఖ నిర్మాత మైత్రీ రవిశంకర్‌. వాయిదాకు కారణం చెప్పలేదు. మరోవైపు ‘మార్చి 18న రావాలని ఫిక్స్‌ అయ్యాం.. వస్తాం కూడా’ అని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ఇదంతా ‘ఫౌజీ’ వర్సెస్‌ ‘స్పిరిట్‌’ గురించే.

Prabhas

ఈ ఏడాది డిసెంబరు 3న రావాల్సిన ‘ఫౌజీ’ సినిమాను వచ్చే ఏడాదికి తీసుకెళ్లారు. డేట్‌ సంగతి ఇంకా చెప్పలేదు. అయితే లేటెస్ట్‌ సమాచారం ప్రకారం ‘స్పిరిట్‌’ డేట్‌ని తీసుకుందాం అనుకుంటున్నారట. మరి ‘స్పిరిట్‌’ సినిమాకు ఏ డేట్‌ ఇస్తారు అనేది తెలియదు. ఈ రెండు సినిమాలు మారడం వల్ల ప్రభాస్‌ (Prabhas) డేట్స్‌ ఇంకాస్త క్లిష్టంగా మారిపోతాయి. ఈ క్రమంలో ఆయన చేతిలో ఉన్న ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ సినిమాలు ఎప్పుడొస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియదు.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్‌ చాలా కన్ఫ్యూజ్‌గా ఉన్నారు. ప్రభాస్‌ సినిమాల విషయంలో ఏం జరుగుతోంది. ఎందుకంటే సినిమాలు ఇలా వాయిదా పడుతున్నాయి. ఏ సినిమా, ఎప్పుడు వస్తుంది అనేది తేలడం లేదు అనే ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 23న పూర్తి క్లారిటీలు వస్తాయి అని చెబుతున్నారు. ఆ రోజు స్పెషల్‌ ఏంటో అందరికీ తెలిసిందే. డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) పుట్టిన రోజు. ఆ రోజున ఆయన సినిమాల అప్‌డేట్స్‌ వస్తాయి.

ఆ లెక్కన ఇప్పుడు సెట్స్‌ మీద ఉన్న ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’తోపాటు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ సినిమాల సమాచారం అందుతుంది. అలాగే అల్లు అర్జున్‌ వదిలేశాడు అంటున్న లోకేశ్‌ కనగరాజ్‌ కథను ప్రభాస్‌ (Prabhas) చేయొచ్చనే వార్తల నేపథ్యంలో దాని మీద కూడా అప్‌డేట్‌ వస్తుంది. ప్రశాంత్‌ వర్మ ‘బ్రహ్మ రాక్షసుడు’ అప్‌డేట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవి కాకుండా ఓ బాలీవుడ్ దర్శకుడు కూడా ఇటీవల కథ చెప్పారట. ఆ సమాచారం కూడా రావొచ్చు.

తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus