Anirudh, Jr NTR: ఎన్టీఆర్ మూవీ గురించి అనిరుధ్ అలా చెప్పారా?

  • June 6, 2022 / 06:16 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్, దేవిశ్రీ ప్రసాద్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలకు ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే ఆప్షన్లుగా నిలుస్తున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. థమన్ కు ధీటుగా మ్యూజిక్ ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ తడబడుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే తమిళంలో మాత్రం అనిరుధ్ ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అనిరుధ్ మ్యూజిక్ కు మంచి మార్కులు పడుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం అనిరుధ్ పేరు మారుమ్రోగుతోంది. బాలీవుడ్ నుంచి కూడా అనిరుధ్ కు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. బీస్ట్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమా పాటలు, బీజీఎంకు మంచి మార్కులు పడ్డాయి.

అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనిరుధ్ మ్యూజిక్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించగా ఎన్టీఆర్30 సినిమాకు కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇస్తానని అనిరుధ్ సన్నిహితుల దగ్గర వెల్లడించారని సమాచారం. సినిమాలోని ప్రతి పాట సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటానని అనిరుధ్ చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీతో సక్సెస్ సాధించడంతో పాటు గత సినిమాల చేదు జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తానని అనిరుధ్ వెల్లడించారని బోగట్టా.

ఎన్టీఆర్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరిగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అనిరుధ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus