ఎందుకు జరుగుతుందో, ఎవరు కారణమో తెలియదు కానీ.. కథానాయిక అంజలికి వ్యక్తిగత జీవితం, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. గతంలో రిలేషన్ రూమర్లు కారణమో లేక లేటెస్ట్ సమాచారమో కానీ బయటకు ఆమె వస్తే ఈ ప్రశ్న కన్ఫామ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు మరోసారి ఈ విషయంపై ప్రశ్న వచ్చింది. దానికి ఆమె సరదాగా స్పందించింది. దీంతో ఆ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్ను ఎవరైనా అడిగితే ఎలా అనిపిస్తుంది అని అడిగితే.. పెళ్లి చేసుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఇప్పట్లో తాను ఆ దిశగా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. ‘‘అది నా పెళ్లి. నాకిష్టమైనప్పుడు చేసుకుంటా. ఇందులో తొందరపడాల్సిన అవసరం ఏముందో నాకర్థం కావడం లేదు’’ అని క్లారిటీ చెప్పేస్తా అని చెప్పింది. పెళ్లి కూతురి కంటే స్నేహితులకే ఈ వేడుకలంటే ఇష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది అంజలి.
పెళ్లయ్యాక అందరూ వెళ్లిపోతారు. నేను మాత్రమే మిగులుతాను. చక్కగా ముస్తాబవ్వడం, ఫొటోషూట్లు చేయడం, సందడి చేయడం.. నా స్నేహితులకు చాలా ఇష్టం. వాళ్లు సరదాగా ఎంజాయ్ చేయడానికి నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అని నవ్వుతూ అడిగింది అంజలి. అంతేకాదు తన స్నేహితులకు సరదాగా ఓ ఆఫర్ కూడా ఇచ్చానని చెప్పింది. ‘‘మీరే పెళ్లి చేసుకోండి, నేను వచ్చి చక్కగా రెడీ అయి ఫొటోషూట్లలో పాల్గొంటానని వారికి చెప్పాను అని చెప్పింది,.
నా ఫ్రెండ్స్ ఫొటోషూట్ల కోసం నేను ఇంకెవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? సారీ.. ఆ విషయంలో నేను వాళ్ల మాట వినలేను’’ అని కౌంటర్ వేసింది. దీంతో అంజలి పెళ్లి విషయంలో ఓ క్లారిటీతోనే ఉంది అని అర్థమవుతోంది. అంజలి కెరీర్ విషయానికొస్తే.. ఇటీవల విశాల్ ‘మకుటం’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం రామ్ దర్శకత్వంలో ‘ఏళు కడల్ ఏళు మలై’ సినిమాలో నటించింది. సూరి, నివిన్ పౌలీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘సంచారి’ పేరుతో అక్టోబర్ 1న విడుదలవుతోంది.