డాన్స్ తో అదరగొట్టిన అంజలి

  • September 15, 2018 / 01:35 PM IST

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా) వేడుక అట్టహాసంగా జరుగుతోంది. నిన్న మొదలైన ఈ వేడుకలో దక్షిణాది సినీ తారలు పాల్గొన్నారు. తొలి రోజు టాలీవుడ్‌, కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల‌కి సంబంధించిన విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి ఈ అవార్డుల‌ని అందించారు. బాహుబలికి కంక్లూజన్ అనేక అవార్డులను కైవశం చేసుకుంది. ఈ వేడుకలో అంజలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువ హీరోలతో పాటు వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతోనూ కలిసి నటించిన అంజలి.. హీరోయిన్ ఓరిటెంటెడ్ సినిమా గీతాంజలిలోను నటించి విజయాన్ని అందుకుంది.

అయితే బరువు పెరగడంతో హీరోయిన్  అవకాశాలు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. అందుకే సరైనోడు చిత్రంలో బ్లాక్ బస్టర్ అంటూ చిందులేసింది. ఆ తర్వాత తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కే పరిమితమైంది. ఇప్పుడు సైమా వేదికపై ఆమెను చూసిన వారు ఆశ్చర్యపోయారు. మెరుపుతీగలా మారిపోవడమే కాకుండా.. సిల్వర్ డ్రస్ లో బంగారు లేడిలా మెరిసిపోయింది. చెంగు చెంగుమంటూ స్టెప్పులు వేసి మైమరపింపచేసింది. ఇలా మరో మారు ఆమె దక్షిణాది దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఈ దెబ్బతో మళ్ళీ అంజలి తెలుగు సినిమాల్లో బిజీ అయిపోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus