అంజలి, జై జంటగా హారర్ చిత్రం..!
- June 18, 2016 / 02:36 PM ISTByFilmy Focus
తమిళ నటుడు జై, అంజలి లు జంటగా మరో చిత్రం రానుంది. నూతన దర్శకుడు సినిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. హారర్ మూవీ గా రూపొందనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మరోవైపు ఈ చిత్రం కోసం అంజలి కాస్త బరువు కూడా తగ్గనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
కాగా వీరిద్దరు కలిసి ఎంజైమ్ ఎప్పుధామ్ చిత్రంలో నటించగా.. ఈ చిత్రం తెలుగులో ‘జర్నీ’ గా విడుదల అయ్యింది. అంజలి నటించిన ‘ఇరైవి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోగా.. ఆమె నటిస్తున్న ‘చిత్రాంగద’ చిత్రం విడుదలకు సిద్దమౌతోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














