నేను గే కాదు బాబోయ్ అని ఎస్కేప్ అయ్యాను

  • January 31, 2023 / 02:12 PM IST

బాలీవుడ్లో ‘గే’ల సంఖ్య కాస్త ఎక్కువే..! వాళ్ళను కనిపెట్టడం చాలా కష్టమని గతంలో చాలా మంది నటీనటులు చెప్పుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ప్రూవ్స్ వాళ్ళు బయటకు పెట్టకపోయేసరికి.. అవి అభియోగాలు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు మరో నటుడు అలాంటి అనుభవం గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 16’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇక ఈ మధ్యనే అంకిత్ గుప్తా అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఉదారియన్ సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇతను ‘బిగ్ బాస్’ నుండి ఇలా ఎలిమినేట్ అయ్యాడో లేదో వెంటనే మరో షోలో ఛాన్స్ దక్కించుకున్నట్టు వినికిడి. మరోపక్క అతను వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన జీవితంలో జరిగిన క్యాస్టింగ్ కౌచ్ అనుభూతిని చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను.

ఓరోజు ఆడిషన్ కి వెళ్తే.. ఒకతను నన్ను కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి. అవి పాటిస్తేనే మంచి ఛాన్స్ లు వస్తాయి అన్నాడు. ‘ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్న వాళ్ళు ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశాకే స్టార్లు అయ్యారు. నాకు కొంచెం కోపరేట్ చేస్తే నిన్ను కూడా స్టార్ ను చేస్తాను. నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు’ అంటూ అసభ్యంగా తాకబోయాడు. అంతే ‘నేను అలాంటి వాడిని కాదు బాబోయ్ అని చెప్పి బయటకు వచ్చేశాను. నా కెరీర్లో అదొక చెత్త అనుభవం’… అంటూ తెలిపాడు అంకిత్ గుప్తా.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus