అంకిత లోఖండే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్!

  • December 4, 2021 / 03:24 PM IST

బాలీవుడ్ లో ‘పవిత్ర రిష్టా’ అనే టీవీ సీరియల్ తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంకిత లోఖండే. అదే సీరియల్ లో నటించిన నటుడు సుశాంత్ రాజ్ పుత్ తో చాలా కాలం డేటింగ్ చేసింది. సుశాంత్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు. దాదాపు ఆరేళ్ల పాటు వీరి రిలేషన్ కొనసాగింది. కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోయింది. అయినప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్ పై ఎఫెక్ట్ రానివ్వకుండా చూసుకున్నారు.

అంకిత లోఖండే నటించిన ‘మణికర్ణిక’ రిలీజైనప్పుడు ఆమెకి విషెస్ చెప్పాడు సుశాంత్. కానీ అతడి మరణంతో వీరి మధ్య ఉన్న స్నేహం కూడా ముగిసిపోయింది. సుశాంత్ చనిపోయినప్పుడు అంకిత చాలా ఎమోషనల్ అయింది. ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు అంకిత తన బాయ్ ఫ్రెండ్ విక్కీ జైన్ ని వివాహం చేసుకోబోతుంది. కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. అప్పుడే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.

దీనికి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. డిసెంబర్‌ 12, 13, 14 తేదిల్లో అంకిత-విక్కీల పెళ్లి జరగనుందని సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus