పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అన్నా కొణిదెల పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో అఫిసియల్ అకౌంట్ ఓపెన్ చేయటం, దాని ద్వారా తన భావాలను అభిమానులతో డైరక్ట్ గా షేర్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే రీసెంట్ గా తాను షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎంటా పోస్ట్ చూసేద్దాం రండి.
ఇక విషయానికొస్తే.. తీన్మార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పక్కన విదేశీ భామ ఒకరు ఉండగా, ఆమెనే ప్రస్తుతం అన్నా కొణిదెల అంటూ ఎప్పటినుంచో ఒక వార్త ఆన్లైన్లో తెగ హడావిడి చేస్తూ ఉండటం జరుగుతుంది. కొంత మంది అయితే ఆ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మే పవన్ కళ్యాణ్ సతీమణి అని ఫిక్స్ అయిపోయారు కూడా. ఈ రూమర్స్ కి, అనుమానాలకు చెక్ పెడుతూ స్వయంగా అన్నా కొణిదెల తన ఇన్ స్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ ద్వారా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని తాను కాదంటూ క్లారిటీ ఇస్తూ ఈ విధంగా పోస్ట్ చేసారు.
“ఇది నేను కాదు. ఈ తప్పు ఎవరు మొదట చేశారో తెలియదు. ఈ ఫోటోలో ఉన్నది మిస్ డానా మార్క్స్. నేను నా జీవితంలో ఎప్పుడూ మోడల్‌గా లేదా నటిగా పనిచేయలేదు. మళ్లీ చెబుతున్నాను… ఈ మహిళ నేను కాదు.” అంటూ ఎన్నో ఏళ్లుగా సర్క్యూలేట్ అవుతున్న రూమర్ కి పుల్ స్టాప్ పెట్టారు. దీంట్లో చెప్పుకోదగ్గ మరొక విషయం ఏంటంటే.. విదేశీ వనిత అయిన కూడా తెలుగు నేర్చుకుంటూ స్వయంగా తెలుగులో పోస్ట్ లను షేర్ చేయటం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.